: బీజేపీకి చెంపదెబ్బ!
భారతీయ జనతా పార్టీకి కన్నడనాట ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ చేతిలో చిత్తవడం కంటే కూడా 11 జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం వారి ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. 222 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీ 39 స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షం హోదా కోసం జేడీఎస్ తో హోరాహోరీ పోరాడుతోంది పాపం.