Telugudesam: రేపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

  • విభజన హామీల సాధనకై ఎంపీలకు దిశానిర్దేశం..!
  • కేంద్రంపై జగన్ అవిశ్వాస ప్రకటనపైనా చర్చించే అవకాశం
  • ఈ నెల 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్న గ్రీవెన్స్ హాలులో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఈ నెల 5 నుంచి జరగనున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన తమ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నింటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమని వైకాపా ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఫిబ్రవరిలో మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తిరిగి ప్రారంభమవుతున్న ఈ సమావేశాల్లో ఎలా తమ హక్కులను సాధించుకోవాలనే అంశంపై ఎంపీలకు బాబు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News