pakistan: ఈ పిల్లాడిని పట్టుకోండి!: వసీం అక్రమ్

  • పాక్ తరపున 916 వికెట్లు తీసిన వసీం అక్రం
  • వసీం అక్రమ్, మహ్మద్ అమీర్ బౌలింగ్ యాక్షన్ ను పోలిన పిల్లాడి వీడియో
  • పిల్లాడి కోసం ట్విట్టర్ లో వెతుకుతున్న వసీం అక్రమ్

916 వికెట్లు తీసిన పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఒక చిన్నోడి గురించి ఆరాతీస్తున్నాడు. ఆ పిల్లాడు ఎక్కుడుంటాడో చెప్పండని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నాడు. దాని వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ నెటిజన్ల సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పిల్లాడు బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నిమిషం నిడివి వున్న ఈ వీడియోలో పట్టుమని పదేళ్లైనా లేని పిల్లాడు, 17 బంతులు బౌలింగ్ చేశాడు.

వాటిలో ఏడు బంతులు ఓ వికెట్ ను పడగొట్టగా, పది బంతులు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో విసిరాడు. బౌలింగ్ యాక్షన్ కూడా వసీం అక్రమ్, మహ్మద్ అమీర్ లా ఉండడం విశేషం. దీనిని ట్విట్టర్ లో ఫైజాన్ రంజాన్ అనే యువకుడు వసీం అక్రమ్ ను చూడాలంటూ ట్వీట్ చేయగా, 'ఇలాంటి టాలెంట్‌ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండి' అంటూ అక్రమ్ దానిని రీ ట్వీట్‌ చేశాడు. ఈ వీడియో చూసిన అక్రమ్‌ భార్య షానెరియా ‘బహుశా అతను మరో అక్రమ్‌ ఏమో?’ అంటూ వ్యాఖ్యానించింది. 

pakistan
vasim akram
Cricket
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News