srikanth: పెద్ద ఇత్తడి కూజా వచ్చి నా తలపై పడింది .. అయిపోయాడు అనుకున్నారు: శ్రీకాంత్

  • 'రా రా' షూటింగు జరుగుతోంది 
  • అప్పుడే ఆ ప్రమాదం జరిగింది 
  • స్పృహలోకి రావడానికి కొంత టైమ్ పట్టింది

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ, ఈ మధ్య తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించాడు. " 'రా రా' సినిమా షూటింగ్ జరుగుతోంది .. సీన్లో నాతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు వున్నారు. ఆ సీన్లో అంతా పారిపోయి భయంతో అలా నేలపై పడుకుని ఉండిపోవాలి".

"నేను అలా పడుకోగా .. పైన ఉన్న పెద్ద ఇత్తడి కూజా జారిపోయి వచ్చి నా తలపై పడింది. అంతే .. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. పది నిమిషాల తరువాత నాకు స్పృహ వచ్చింది. అక్కడ వున్న వాళ్లంతా అయిపోయాడు అనుకున్నారట .. అయినా అంత తొందరగా మనమెందుకు పోతాం?" అంటూ ఆయన నవ్వేశాడు.    

  • Loading...

More Telugu News