suresh babu: తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్: సురేశ్ బాబు

  • అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం
  • భవిష్యత్తులో చిన్న సినిమాలకు కూడా లాభాలు వస్తాయి
  • ఐదు రాష్ట్రాల నిర్మాతలతో సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకున్నాం 
  • డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు పీపీఎఫ్ తగ్గించట్లేదు

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ థియేటర్ల బంద్‌కు దక్షిణాది నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై హైద‌రాబాద్‌లో నిర్మాతలు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడుతూ... సినిమా థియేటర్ల బందుతో వచ్చే నష్టం కన్నా, తాము ఈ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో వచ్చే నష్టమే ఎక్కువ అని చెప్పారు. అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

తాము తీసుకుంటోన్న చర్యలతో భవిష్యత్తులో చిన్న సినిమాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల నిర్మాతలతో సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకున్నామని సురేశ్ బాబు చెప్పారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు పీపీఎఫ్ తగ్గించట్లేదని ఆయన అన్నారు.    

  • Loading...

More Telugu News