priyaprakash varrir: టాలీవుడ్ సినిమాకి సంతకం చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్?

  • కనుసైగలతో యువ హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్  
  • ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో ప్రదర్శించిన హావభావాలకు ఫిదా
  •  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాకు సంతకం! 

కేవలం అందమైన కనుసైగలతో దేశంలోని యువకుల హృదయాలను కొల్లగొట్టిన వర్ధమాన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ సినిమాకు సంతకం చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మలయాళంలో ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాతో ప్రియా ప్రకాశ్ వారియర్ వెండితెరకు పరిచయమవుతోంది. ఈ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవై ’ పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ఫిదా అయిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తీయబోయే తదుపరి సినిమాలో ప్రియకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లు కూడా ఆమెతో కలిసి పని చేయాలని భావిస్తుండగా, మరోపక్క టాలీవుడ్‌ లో పేరున్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించనున్న తదుపరి సినిమాకు ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా సంతకం చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.  

priyaprakash varrir
oru adhar love
Tollywood
  • Loading...

More Telugu News