srikanth: జనాలు నన్ను అలా చూసి నిజంగానే పిచ్చోడు అనుకున్నారు: శ్రీకాంత్

  • పోసాని ఆ సీన్ గురించి ముందే చెప్పాడు 
  • పబ్లిక్ లో రోడ్లపై ఆ సీన్ తీశారు 
  • ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు

'ఖడ్గం ' .. 'మహాత్మా' వంటి సందేశాత్మక చిత్రాల్లోనే కాదు, 'ఆపరేషన్ దుర్యోధన' వంటి విభిన్నమైన కథా చిత్రంలోనూ శ్రీకాంత్ నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన సిటీలోని రోడ్లపై బట్టల్లేకుండా నడచుకుంటూ వెళ్లాల్సిన సీన్ వుంది. ఆ సీన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ .. " పోసాని ఈ కథ చెబుతున్నప్పుడే రాజా ఈ సీన్ ఇలా ఉంటుంది .. సినిమాలోని కీలకమైన సన్నివేశాల్లో ఇదొకటి అని చెప్పాడు.

ఎలా చేస్తావో నాకు తెలియదు .. అదిరిపోవాలి అన్నాడు . 'మరేం ఫరవాలేదు చేసేద్దాం' అన్నాను. ఈ సీన్ ను అమీర్ పేట సెంటర్లో .. చార్మినార్ .. బేగంపేట తదితర చోట్ల చిత్రీకరించారు. గుండుతో .. పైన బట్టలు లేకుండా వున్న నన్ను కార్లో ఒకచోట దింపేసేవారు. దూరంగా వెళ్లి .. నేను నడచుకుంటూ వస్తుంటే షూట్ చేసేవాళ్లు. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా నన్ను చూసేవారు .. కానీ ఎవరూ గుర్తుపట్టేవాళ్లు కాదు .. నిజంగానే పిచ్చోడు అనుకున్నారు' అంటూ నవ్వేశాడు .     

  • Loading...

More Telugu News