team india: హైదరాబాద్ లో సందడి చేసిన ఇర్ఫాన్ పఠాన్

  • స్టార్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఈవెంట్ లో ఇర్ఫాన్ సందడి
  • యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేసిన స్పీడ్ స్టర్
  • జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి ఐపీఎల్ మంచి వేదిక అంటూ సూచన

టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హైదరాబాదులో సందడి చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా నిన్న హైదరాబాదులో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ తో పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు దీపక్ హుడా, మెహ్దీ హసన్, తన్మయ్ అగర్వాల్, మాజీ భారత ఆటగాడు ఆకాశ్ చోప్రాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ, యువగాళ్లకు జాతీయ జట్టులో స్థానం దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న కుర్రాళ్లకు ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఉందని తెలిపాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కుర్రాళ్లకు దక్కిన అత్యధిక ధరలు దీనికి నిదర్శనమని చెప్పాడు. కష్టపడే ఆటగాళ్లకు ఫలితం దక్కుతుందని తెలిపాడు.

team india
ipl
star sports
irfan pathan
  • Loading...

More Telugu News