Donald Trump: ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేసి రాజీనామా చేసిన వైట్ హౌస్ డైరెక్టర్ మిస్ హోప్ హిక్స్

  • రోజూ అబద్ధాలు ఆడలేకపోతున్నా
  • రాజీనామాకు ముందు హోప్ హిక్స్ వ్యాఖ్యలు
  • ఏడాదిలో మారిన నలుగురు డైరెక్టర్లు
  • ఎక్కువ కాలం పనిచేసింది మాత్రం హోప్ హిక్సే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన విమర్శలు చేస్తూ, వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మిస్ హోప్ హిక్స్, తన పదవికి రాజీనామా చేశారు. ఎక్కువకాలం ట్రంప్ సహాయకురాలిగా ఉన్న 29 ఏళ్ల హోప్ హిక్స్ మాజీ మోడల్ కాగా, ఆమెను ట్రంప్ ఏరికోరి నియమించుకున్నారు. గడచిన ఏడాది వ్యవధిలో శ్వేతసౌధంలోని కమ్యూనికేషన్స్ విభాగానికి నలుగురు డైరెక్టర్లు మారిన సంగతి తెలిసిందే.

రాజీనామాకు ముందు హోప్ హిక్స్ తన సన్నిహితులతో మాట్లాడుతూ, ట్రంప్ కోసం రోజూ శుద్ధ అబద్ధాలు ఆడలేక పోతున్నానని, అందువల్లే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కాగా, వైట్ హౌస్ నుంచి నిత్యమూ పత్రికా ప్రకటనల విడుదల, మీడియా సమావేశాల నిర్వహణ, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే వార్తల సమీకరణ వంటి కీలకమైన బాధ్యతలను కమ్యూనికేషన్స్ విభాగం చూసుకుంటుంది.

Donald Trump
Hope Hicks
White House
Resign
  • Loading...

More Telugu News