Pakistan: పీఎస్ఎల్ లో మరో స్పాట్ ఫిక్సర్... పాక్ క్రికెటర్ పై ఏడాది నిషేధం

  • పీఎస్ఎల్ సీజన్-2లో స్పాట్ ఫిక్సింగ్
  • ఏడాది నిషేధానికి గురైన షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్, షహజైబ్ హసన్
  • 2009లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో షహజైబ్ సభ్యుడు

స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ని బెంబేలెత్తిస్తోంది. ఐపీఎల్ కు దీటుగా పీఎస్ఎల్ ను తీర్చిదిద్దాలని పీసీబీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, మ్యాచ్ లకు ఆదరణ కరవవడంతో పాటు, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం పాక్ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

ఇప్పటికే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ లపై నిషేధం వేటు పడగా, తాజాగా షహజైబ్‌ హసన్‌ పై ఏడాది నిషేధం వేటు పడింది. షహజైబ్ హసన్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు పీసీబీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్‌ కు సాక్ష్యాలు దొరకడంతో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. హసన్‌ 2009లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో సభ్యుడు. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Pakistan
psl
Cricket
spot fixing
  • Loading...

More Telugu News