Chandrababu: ప్రధాని పదవిపై నాకు ఆసక్తి లేకపోవడానికి కారణం ఇదే: చంద్రబాబు
- ప్రధాని కావాలంటే చాలా మందిపై ఆధారపడాల్సి ఉంటుంది
- పదవి పూర్తైన తర్వాత మాజీ ప్రధానిగా ఏం చేయాలి?
- ప్రధానిగా అవకాశం వచ్చినా నాకు వద్దు
తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ అని... కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యపడని విషయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రాంతీయ పార్టీకి చెందిన నేత ప్రధాని కావాలంటే చాలా మందిపై ఆధారపడాల్సి ఉంటుందని చెప్పారు. ఏడాదికో, ఏడాదిన్నరకో ఆ పదవి కూడా పూర్తయిపోతే... అప్పుడు మాజీ ప్రధానిగా తాను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.
చేయలేని పనిని నెత్తిన పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రధాని పదవి చేపట్టే అవకాశం తనకు వచ్చినా... ఆ పదవి తనకు అవసరం లేదని చెప్పారు. దేశానికి, ప్రపంచానికి ఏపీని ఒక నమూనాలా చేయడమే తన లక్ష్యమని అన్నారు. రాజకీయవేత్తగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.