cell phones on moon: చంద్రుడిపైనా త్వరలో సెల్ ఫోన్ నెట్ వర్క్... 4జీ నెట్ వర్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు

  • చిన్న పరిమాణంలో నెట్ వర్క్ పరికరం
  • అభివృద్ధి బాధ్యతలు నోకియాకు
  • 2019లో ప్రయోగం

చందమామను త్వరలో సెల్ ఫోన్లు పలకరించనున్నాయి. చంద్రుడిపై 4జీ నెట్ వర్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు సహకారం అందించనున్నట్టు ప్రకటించాయి. అమెరికా నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపి 50 ఏళ్లు కాగా, ఇన్నాళ్లకు సెల్ ఫోన్ల టెక్నాలజీని అక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నారు.

స్పేస్ గ్రేడ్ నెట్ వర్క్ అభివృద్ధి కోసం నోకియాను భాగస్వామిగా ఎంచుకున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి కంపెనీలు బెర్లిన్ కేంద్రంగా నడిచే పీటీ సైంటిస్ట్స్ తో కలసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి 2019లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం కేప్ కెనరవాల్ నుంచి జరగాల్సి ఉందని వొడాఫోన్ వెల్లడించింది. 4జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్నట్టు వొడాఫోన్ ఉద్యోగి ఒకరు తెలిపారు.

cell phones on moon
  • Loading...

More Telugu News