sridevi: సెలబ్రేషన్స్ క్లబ్ కు శ్రీదేవి భౌతికకాయం తరలింపు
- గ్రీన్ ఏకర్స్ నుంచి భౌతికకాయం తరలింపు
- పోటెత్తుతున్న అభిమానులు
- సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు
ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసం నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ క్లబ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడకి ఆమె అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన కథానాయికను చివరిసారి చూడాలనే తపనతో వేలాది మంది అక్కడకు తరలివచ్చారు.
మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని సందర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. మరోవైపు శ్రీదేవిని కడసారి చూసేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.