Sridevi: శ్రీదేవి మృతిపై దుబాయ్ ఆరోగ్యశాఖ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగాలు ఏం చెప్పాయంటే...!

  • భవిష్యత్ లో ఈ కేసుపై ఎలాంటి దర్యాప్తు ఉండదు
  • ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి శ్రీదేవి మృతి చెందారు
  • ఆమెకు ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకే వ్యాధులు లేవు

ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్ లోని జుమేరా హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆమె మృతదేహం ముంబై చేరింది. ఈ నేపథ్యంలో దుబాయ్ ఆరోగ్యశాఖ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగాలు ఏమన్నాయంటే... సుదీర్ఘ దర్యాప్తు అనంతరం శ్రీదేవి మృతి కేసును క్లోజ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శ్రీదేవి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చామని స్పష్టం చేశారు. ఈ కేసుపై భవిష్యత్తులో ఎలాంటి దర్యాప్తూ ఉండదని స్పష్టం చేశారు.

అలాగే, శ్రీదేవి బాత్రూంలో స్పృహ కోల్పోయి, ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌ లో మునిగి చనిపోయారని ఎంబామింగ్‌ సర్టిఫికెట్‌ లో దుబాయ్‌ ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఈ సందర్భంగా ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని, ఆమెకు ఎలాంటి ఇన్‌ ఫెక్షన్‌ సోకే వ్యాధులు కూడా లేవని స్పష్టం చేసింది. అనంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ (రసాయన పూత ప్రక్రియ) పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ ప్రకటించింది.  

  • Loading...

More Telugu News