orlando bloom: మీరు 300 సినిమాలు ఎలా చేయగలిగారు?: ఆశ్చర్యంతో శ్రీదేవిని ప్రశ్నించిన హాలీవుడ్ నటుడు

  • 2015లో యూపీ పర్యటనకు వచ్చిన హాలీవుడ్ నటుడు ఓర్లాండో బ్లూమ్
  • విందు ఏర్పాటు చేసిన అమర్ సింగ్
  • శ్రీదేవిని ఓర్లాండోకు పరిచయం చేసిన శీతల్ తల్వార్

'ట్రాయ్‌', 'కింగ్‌ డమ్‌ ఆఫ్‌ హెవెన్‌', 'ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌', 'పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌' తదితర హాలీవుడ్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఓర్లాండో బ్లూమ్ 2015లో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత శీతల్‌ తల్వార్‌ తో కలిసి ఉత్తరప్రదేశ్‌ పర్యటనకు వచ్చాడు. ఆయన గౌరవార్థం సమాజ్ వాదీ పార్టీ నేత అమర్‌ సింగ్ తన నివాసంలో పలువురు ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు.

అమర్ సింగ్ ఆహ్వానం మేరకు ఈ విందులో పాల్గొన్న శ్రీదేవిని ‘300లకు పైగా సినిమాల్లో నటించిన నటీమణి’ అంటూ శీతల్ తల్వార్, ఓర్లాండోకు పరిచయం చేశారు. దీంతో ఓర్లాండో ఆశ్చర్యపోయాడు. ఆమెను విష్ చేస్తూ, మీరు నిజంగా 300 సినిమాల్లో నటించారా? అంటూ ప్రశ్నించాడు. అన్ని సినిమాలు ఎలా చేయగలిగారు? ఒక సినిమా చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటూ ప్రశ్నలు సంధించాడు. ఆయన ప్రశ్నలకు శ్రీదేవి చిరునవ్వుతో సమాధానం చెప్పారు. 

orlando bloom
sheetal talwar
Sridevi
amarsingh
  • Loading...

More Telugu News