: నెల రోజుల్లో ఒక్క బెల్టు షాపు కూడా కనిపించకూడదు: ఎక్సైజ్ శాఖకు సీఎం ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బెల్టు షాపులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం ఏలూరులో అమ్మహస్తం కార్యక్రమంలో సభావేదికపై నుంచి కేంద్రమంత్రి జైరాం రమేశ్ బెల్టు షాపులు ఎత్తివేయాలని సీఎం ను కోరిన సంగతి తెలిసిందే. ఆయన కోరికను అక్కడికక్కడే మన్నించిన కిరణ్ కుమార్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. తక్షణమే బెల్టు షాపుల ఎత్తివేత దిశగా కార్యాచరణ ప్రారంభించాలని ఈరోజు మధ్యాహ్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా నెలరోజుల్లోగా బెల్టు షాపులు ఎత్తివేయాలని, ఆమేరకు నివేదిక అందించాలని కూడా స్పష్టం చేశారు.