england: ఈ ఫొటోలో ఉన్నది పుతిన్ అనుకుని పొరబడ్డ నెటిజన్లు!

  • ఈ ఫొటోలో ఉన్న ఇంగ్లండ్  మాజీ కెప్టెన్ ని ఎవరైనా గుర్తుపట్టగలరా? అంటూ జోస్ బట్లర్ పోస్ట్ 
  •  నాసర్ హుస్సేన్ ని చూసి పుతిన్ అనుకున్న నెటిజన్లు
  • టవల్ కట్టుకుని చెప్పులు లేకుండా రోడ్డుపై నడిచి వెళుతున్న నాసర్ 

ఇంగ్లండ్ వికెట్ కీపర్ - బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ పోస్ట్ చేసిన ఓ ఫొటోను చూసిన నెటిజన్లు పొరబడ్డారు. ఆ ఫొటోలో ఉన్నది ఒకరైతే, నెటిజన్లు ఊహించుకున్నది మరొకరిని. ఇంతకీ, జోస్ బట్లర్ పోస్ట్ చేసిన ఫొటో ఎవరిదంటే .. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ ది.

అయితే, నాసర్ హుస్సేన్ ఫ్యాంటు, షర్టు ధరించో లేక సూటు బూటూ లోనో లేదంటే క్రికెట్ డ్రెస్సులోనో ఈ ఫొటోలో మనకు కనిపించడు. సింపుల్ గా ఒక టవల్ కట్టుకుని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోడ్డుపై నడిచి వెళ్తూ ఫొటోలకు పోజివ్వడం మనం గమనించవచ్చు.

‘ఈ ఫొటోలో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ని ఎవరైనా గుర్తుపట్టగలరా?’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్లు స్పందించారు. ఆ ఫొటోలో ఉన్నది రష్యా అధ్యక్షుడు పుతిన్ అని కొందరు పొరబడగా, మరికొందరు కచ్చితంగా చెప్పగలిగారు. ఇంకొందరు మాత్రం అయితే పుతిన్ లేకపోతే నాసర్ హుస్సేన్ గా పేర్కొన్నారు.

england
jos buttler
putin
  • Error fetching data: Network response was not ok

More Telugu News