Sridevi: శ్రీదేవి నటించిన దక్షిణాది చిత్రాల గురించి ప్రస్తావించని ఢిల్లీ పత్రికలు!

  • దక్షిణాదిలో ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి 
  • ఆ విషయాన్ని ఢిల్లీ పత్రికల్లో ప్రస్తావించలేదు 
  • ఆంగ్ల జర్నలిస్టు జక్కా జాకోబ్ ట్వీట్
  • ఇదే విషయాన్ని నేను చెబుతూనే ఉన్నా..: నటి ఖుష్బూ స్పందన

ప్రముఖ నటి శ్రీదేవి మరణానికి సంబంధించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్లు, పత్రికలు మార్మోగుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లో శ్రీదేవి నటించిన సినిమాల గురించి ఢిల్లీ పత్రికలు ప్రస్తావించకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయమై ఆంగ్ల జర్నలిస్టు జక్కా జాకోబ్ స్పందిస్తూ, ఢిల్లీకి చెందిన ఏ వార్తాపత్రికలోనూ శ్రీదేవి నటించిన దక్షిణాది భాషా చిత్రాల గురించి వెల్లడించకపోవడం బాధాకరమని, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాతే శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లారని తన ట్వీట్ లో ఆయన ప్రస్తావించారు. ఈ ట్వీట్ పై ప్రముఖ నటి ఖుష్బూ స్పందిస్తూ, ‘ఇదే విషయాన్ని నేను చెబుతూనే ఉన్నా..’ అని తన ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. 

Sridevi
New Delhi
kushboo
  • Error fetching data: Network response was not ok

More Telugu News