allu arjun: ' నా పేరు సూర్య' నుంచి వచ్చేనెల 2న పోస్టర్ ఇంపాక్ట్

  • 'నా పేరు సూర్య'తో అల్లు అర్జున్ 
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్
  • మే 4వ తేదీన భారీ స్థాయిలో విడుదల

వక్కంతం వంశీ దర్శకత్వంలో ' నా పేరు సూర్య' రూపొందుతోంది. అల్లు అర్జున్ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు ఇంపాక్ట్ ను విడుదల చేస్తే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత వదిలిన రెండు సింగిల్స్ యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చేనెల 2వ తేదీన పోస్టర్ ఇంపాక్ట్ ను వదలనున్నారు. 'హోలీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని రానున్న పోస్టర్ ఇంపాక్ట్ .. బన్నీ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ నటిస్తోన్న ఈ సినిమాను, మే 4వ తేదీన విడుదల చేయనున్నారు. 'దువ్వాడ 'తో ఓ మాదిరి మార్కులు మాత్రమే రాబట్టిన బన్నీ,  ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.         

  • Loading...

More Telugu News