Rajinikanth TV9: ఇంట్లో బొమ్మ ఆడాలంటే భారీగా వ్యయం చేయాల్సిందే!.. టీవీల ధరలకు త్వరలోనే రెక్కలు

  • కేంద్ర బడ్జెట్లో సుంకాలు పెంచుతూ ప్రతిపాదనలు
  • దాంతో ధరలు పెంచే ఆలోచనలో కంపెనీలు
  • ఎంత శాతం పెంచాలన్న విషయమై మదింపు
  • త్వరలోనే 7 శాతం వరకు పెంపు నిర్ణయం

టెలివిజన్ సెట్టు (టీవీ) కొనుగోలు చేయాలనుకుంటున్నారా...? అయితే, ఆలస్యం చేస్తే మీ జేబునుంచి మరికాస్త అదనంగా విదిలించక తప్పదు. ఎందుకంటే టీవీల ధరలు పెరగబోతున్నాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడమే దీనికి కారణం. ప్యానెళ్లపై సుంకం 7.5 శాతం ఉండగా, దాన్ని 15 శాతానికి పెంచారు. అలాగే విడిభాగాలపై 10 శాతం సుంకం ఉండగా దాన్ని సైతం 15 శాతం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

దీంతో సోనీ, శామ్ సంగ్, ఎల్జీ, పానాసోనిక్ తదితర కంపెనీలు టీవీల ధరలను 7 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి. అయితే కచ్చితంగా ఎంత పెంచాలన్న స్పష్టతకు ఇంకా రాలేదు. కస్టమ్స్ సుంకం పెంపు భారం ఎంత పడుతుందో అంచనా వేసి ఆ మేరకు దాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలనుకుంటున్నాయి. కస్టమ్స్ సుంకం ప్రభావం అంచనా వేసిన తర్వాత ధరలు ఎంత పెంచాలన్నది నిర్ణయిస్తామని సోనీ ప్రకటించింది.

Rajinikanth TV9
prices
  • Loading...

More Telugu News