nagaland tripura: త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీకే విజయం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

  • ఈశాన్యమంతటా బీజేపీ రెపరెపలు
  • అసోం, అరుణచాల్ ప్రదేశ్, మణిపూర్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాం
  • త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలోనూ విజయం సాధిస్తాం

నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘‘అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అలాగే, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికలు కీలకమైనవి. ఇక్కడ కూడా విజయం సాధించబోతున్నాం’’ అని కిరణ్ పేర్కొన్నారు. దీర్ఘకాల సమస్యలతోపాటు ఒంటరి అయ్యామనే భావనను ఎదుర్కొంటున్న ఈశాన్య ప్రజలు బీజేపీ రూపంలో పరిష్కారం వెతుకుతున్నారని ఆయన తెలిపారు. నాగాలాండ్ నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో భాగస్వామ్యం ఉందని, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మేఘాలయలోనూ సానుకూల ఫలితాలొస్తాయన్నారు.

nagaland tripura
elections
  • Loading...

More Telugu News