Nirav Modi: పీఎన్బీని ముంచిన నీరవ్ మోదీ ఇంటి నుంచి పది వేల విదేశీ చేతి గడియారాలు స్వాధీనం!
- ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
- అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్
- అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో నీరవ్ గ్రూప్ కు చెందిన 21 ఆస్తులను జప్తు చేశారు. అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్ చేశామని అధికారులు అన్నారు.
జప్తు చేసిన మరిన్ని ఆస్తుల వివరాలు..
- ఇప్పటి వరకు జప్తు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.6,393 కోట్లు
- ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
- ముంబయిలోని సముద్రమహల్ అపార్టెంట్‌లోని రూ.15.45 కోట్ల విలువ చేసే ఫ్లాట్
- రూ.81.16కోట్ల విలువ చేసే పెంట్‌హౌస్
- 6 రెసిడెన్షియల్ ప్రాపర్టీ, పది కార్యాలయాలు సీజ్
- పూణెలో రెండు ఫ్లాట్లు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబగ్‌లోని ఫామ్ హౌస్
- అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం