: మోడీ ప్రభావంపై పెదవి విరిచిన దిగ్విజయ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలు మింగుడు పడని విషయమే. ఇదే అదనుగా రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విమర్శలకు పదును పెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్.. మోడీపై వ్యాఖ్యానించారు. మోడీ ప్రభావం గుజరాత్ కే పరిమితమని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని నిరూపించాయని, అక్కడ మోడీ ప్రభావం ఏమీ కనిపించలేదని దిగ్విజయ్ పేర్కొన్నారు.