vijay devarakonda: విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేశావే' రిలీజ్ డేట్ ఫిక్స్

  • విజయ్ దేవరకొండ హీరోగా ' ఏ మంత్రం వేశావే'
  • కథానాయికగా శివానీ సింగ్ 
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల

యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు యువ కథానాయకుల జాబితాలో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన అరడజను వరకూ సినిమాలు చేస్తున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఇవి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.

శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ఆయన 'ఏ మంత్రం వేశావే' సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా శివానీ సింగ్ నటించింది. తాజాగా చిత్ర సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ .. " విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ దేవరకొండ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలుస్తుంది. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాం" అని చెప్పారు.  

vijay devarakonda
shivani singh
  • Loading...

More Telugu News