varun tej: వరుణ్ తేజ్ కోసం జార్జియాలో స్పేస్ స్టేషన్ సెట్!
- అంతరిక్షం నేపథ్యంలో వరుణ్ తేజ్ మూవీ
- దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి
- ఈ సినిమా కోసం జార్జియాలో భారీ సెట్
సబ్ మెరైన్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రంగా 'ఘాజీ' ప్రశంసలు అందుకుంది. సబ్ మెరైన్ సెట్ వేసి చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను కానిచ్చేశారు. కానీ ఈ సినిమాకోసం భారీగానే ఖర్చు చేశారనే భావనను సంకల్ప్ రెడ్డి తీసుకొచ్చాడు. తాజాగా ఆయన అంతరిక్షానికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకుని, స్పేస్ స్టేషన్ సెట్ వేయిస్తున్నాడు. క్రిష్ .. రాజీవ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా వరుణ్ తేజ్ నటించనున్నాడు.
ఈ సినిమా కోసం జార్జియాలో 'స్పేస్ స్టేషన్ సెట్' వేస్తున్నారు. అచ్చు స్పేస్ స్టేషన్ ను తలపించే సెట్ ను వేయడంలో ఒక టీమ్ చకచకా పనిచేస్తోందట. చాలావరకూ ఇక్కడే షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. గతంలో వరుణ్ తేజ్ 'కంచె' చిత్రం కూడా జార్జియాలోనే జరిగింది .ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా అక్కడే మొదలుకానుంది. జార్జియా సెంటిమెంట్ వరుణ్ కి కలిసొస్తుందేమో చూడాలి .