Rahul Gandhi: రాహుల్ అసలు నాయకుడే కాదు: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

  • ఓ వ్యక్తిగా రాహుల్ అంటే నాకు ఇష్టం
  • ఆయనలో ఓ నాయకుడిని ఎన్నడూ చూడలేదు
  • ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రాహుల్ నాయకుడే కాదని అన్నారు. ఓ వ్యక్తిగా రాహుల్ అంటే తనకు ఇష్టమని... అయితే ఓ నేతగా ఆయనను తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఆయన చెప్పే విషయాలను పాటించడానికి... ఆయన తనకు అధిష్ఠానం కాదని అన్నారు. ఆయన సోదరి ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

2019 సాధారణ ఎన్నికల్లో పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపును తాను పోటీ చేయబోనని హార్దిక్ స్పష్టం చేశారు. గత గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. హార్దిక్ కు 24 ఏళ్లు మాత్రమే ఉండటంతో... ఆయన పోటీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నారనే కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై హార్దిక్ స్పందిస్తూ, ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 

Rahul Gandhi
hardhik patel
priyanka vadra
  • Loading...

More Telugu News