Rajya Sabha: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల!

  • 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
  • వచ్చేనెల 5న నోటిఫికేషన్‌
  • వ‌చ్చేనెల 23న ఎన్నికలు
  • ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు గానూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) ఈ రోజు షెడ్యూల్ విడుద‌ల చేసింది. 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు గానూ వ‌చ్చేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చేనెల 5న ఇందు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, నామినేషన్‌లు దాఖలు చేయడానికి వచ్చేనెల 12 చివరి తేదీ అని ఈసీ పేర్కొంది. నామినేషన్‌ల ఉపసంహరణకు చివరిగడువు మార్చి 15 అని తెలిపింది.        

Rajya Sabha
elections
  • Loading...

More Telugu News