nirmala seetha raman: నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం కూడా నాకు లేదు: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌

  • భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ చేసిన వ్యాఖ్య‌లపై రక్షణ మంత్రిని ప్రశ్నించిన మీడియా
  • ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు- నిర్మలా సీతారామన్‌
  • వారు చేసే వ్యాఖ్యలతో ‌నాకేంటి సంబంధం?

అసోం రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు అక్రమంగా ప్రవేశిస్తుండడంపై ఇటీవ‌ల భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. వారి కారణంగా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్‌) పుంజుకుంటోందని, దీంతో బీజేపీ కన్నా వేగంగా ఆ పార్టీ ఎదుగుతోందని ఇటీవ‌ల ఆయ‌న అన్నారు.

ఈ విష‌యంపై స్పందించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను మీడియా అడ‌గ‌గా.. ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారని, వారు చేసే వ్యాఖ్యలతో త‌న‌కేం సంబంధం? అని ఆమె ప్ర‌శ్నించారు. తానెందుకు స్పందించాలని, ఆ అవసరం త‌న‌కు లేదని స‌మాధానం ఇచ్చారు.

nirmala seetha raman
bipin ravat
assam
  • Loading...

More Telugu News