google: వివక్షకు వ్యతిరేకంగా గూగుల్ పై కోర్టుకెక్కిన మరో మాజీ ఉద్యోగి

  • శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా
  • తనను వేధింపులకు గురి చేశారని ఆరోపణ
  • ఇటీవలే మరో ఉద్యోగి కూడా ఇదే విధంగా వ్యాజ్యం దాఖలు

గూగుల్ పై మరో మాజీ ఉద్యోగి, ట్రాన్స్ జెండర్ అయిన టిమ్ షెవలీయర్ కోర్టుకెక్కాడు. తనను ఆన్ లైన్ లో వేధింపులకు గురిచేశారంటూ బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రధానంగా డైవర్సిటీ అంశాలను లేవనెత్తాడు. పని ప్రదేశంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించడమే డైవర్సిటీ.

గూగుల్ పై ఇటీవలే జేమ్స్ డామోర్ అనే మాజీ ఉద్యోగి సైతం దావా వేసిన విషయం గమనార్హం. తెల్లజాతి సంప్రదాయ వాదుల కార్పొరేట్ సంస్కృతి గూగుల్ లో నడుస్తోందని అతని ఆరోపణ. దీనిపై గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది. జాతి లేదా లింగత్వానికి సంబంధించి హానికారక విధానాలను ప్రోత్సహించబోమని, అందుకే షెవలీయర్ ను తొలగించాలని నిర్ణయించినట్టు గూగుల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News