Payyavula Keshav: తెలుగుజాతి ప్రతిష్ఠను జగన్ అంతర్జాతీయస్థాయిలో మంటగలిపారు: పయ్యావుల

  • ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కష్టపడుతున్నారు
  • జగన్ ఏపీ ప్రతిష్ఠను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు
  • ప్రజా జీవితానికి ఆయన అనర్హుడు
  • టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, జగన్ తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా మంటగలుపుతున్నారని ఆరోపించారు. తెలుగు జాతికి జగన్ తీవ్ర తలవంపులు తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. విశ్వసనీయత గురించి జగన్ ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజా జీవితానికి ఆయన అనర్హుడని, ఆయన అవినీతికి అంతేలేదన్నారు. తవ్వినకొద్దీ ఆయన అవినీతి బయటపడుతూనే ఉందన్నారు. అటువంటి వ్యక్తి నీతి సూత్రాలు వల్లించడం, విశ్వసనీయత గురించి మాట్లాడడం సిగ్గుచేటైన విషయమన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు అహరహం కష్టపడుతుంటే జగన్ అడ్డుకోవడానికి చూస్తున్నారని పయ్యావుల దుయ్యబట్టారు.

Payyavula Keshav
YS Jaganmohan Reddy
Telugudesam
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News