Narendra Modi: చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారు: మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • నాలుగేళ్లుగా అడుగుతున్నా హామీలను నెరవేర్చలేదు
  • బుందేల్ ఖండ్ కు రూ. 20వేల కోట్లు ఇచ్చారు
  • హామీలను నెరవేర్చకపోతే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గత నాలుగేళ్లుగా విభజన హామీలను అమలు చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నామని... కానీ ఏమీ చేయలేదని చెప్పారు. బుందేల్ ఖండ్ కు మాత్రం ఏడాదిలోపే హామీని నెరవేరుస్తూ రూ. 20 వేల కోట్లను ప్రధాని మోదీ ఇచ్చారని మండిపడ్డారు. త్వరలోనే ఏపీకి మోదీ వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయని... ఇక్కడకు వచ్చాక ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము కోరుతున్నామని... ఒకవేళ హామీలను నెరవేర్చకపోతే కీలకమైన రాజకీయ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటారని చెప్పారు.

Narendra Modi
Chandrababu
adi narayana reddy
  • Loading...

More Telugu News