: గడువులు పెట్టింది కాంగ్రెస్సే: ఎమ్మెల్యే ఈటెల
తెలంగాణ అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం అంటూ డెడ్ లైన్లు పెట్టింది కాంగ్రెస్సేనని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ చెప్పారు. ఆ గడువు లోపు ప్రకటించనందునే తాము నిలదీస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.