Andhra Pradesh: పది వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం: 'కియా' మోటార్స్ అధ్యక్షుడు పార్క్

  • పది వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం
  • ఏపీలో మా సంస్థ యూనిట్ కు శంకుస్థాపన ఆనందంగా ఉంది
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరవలేనిది
  • ప్రజలు, అధికారులు చక్కగా సహకరిస్తున్నారు: పార్క్

2021 నాటికి 21 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, పది వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు పార్క్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగం ఈరోజు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కియో మోటార్స్ సోదర సంస్థ హుందాయ్ ప్లాంట్ ను 1996లో చెన్నైలో ఏర్పాటు చేశామని, ఇప్పుడు, ఏపీలో ఈ సంస్థ యూనిట్ కు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ‘కియా’ మోటార్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరవలేనిదని, ప్రజలు, అధికారులు చక్కగా సహకరిస్తున్నారని కితాబిచ్చిన పార్క్, తమ సంస్థ
ద్వారా సామాజిక కార్యక్రమాలు కూడా చేపడతామని అన్నారు.

Andhra Pradesh
kia motors
park
  • Loading...

More Telugu News