vanteru pratap reddy: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తెలంగాణ టీడీపీ నేత వంటేరు!

  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు
  • గత ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ
  • గత కొంత కాలంగా టీడీపీ నాయకత్వంపై అసంతృప్తి

తెలంగాణ టీడీపీ నుంచి మరో కీలక నేత బయటకు రాబోతున్నారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చే నెలలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పై పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చారు. అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. అనంతరం ఆయనకు రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో గట్టి నాయకుడి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ పార్టీ వంటేరుపై దృష్టి సారించింది.

టీఆర్ఎస్ పై గట్టిగా పోరాటం చేసిన వంటేరు... గత కొన్ని రోజుల నుంచి టీడీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ భవన్ కు కూడా దూరంగా ఉంటున్నారు. మరోవైపు, చంద్రబాబుతో కూడా చర్చించిన తర్వాతే ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

vanteru pratap reddy
tTelugudesam
congress
  • Loading...

More Telugu News