Ramgopal Varma: రాంగోపాల్ వర్మ మెడకు బిగుస్తున్న ఉచ్చు... మరిన్ని సెక్షన్ల కింద కేసులు!

  • ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందేనంటున్న మహిళా సంఘాలు
  • ఐటీ చట్టాన్ని చేర్చిన పోలీసులు
  • వర్మపై బీజేపీ నేత తుమ్మలపల్లి పద్మ కేసు

వివాదాస్పద పోర్న్ షార్ట్ ఫిల్మ్ 'జీఎస్టీ', ఆపై ఓటీవీ చానల్ డిస్కషన్ లో పాల్గొని మహిళా ఉద్యమ కార్యకర్త పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయడం తదితరాలతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మెడకు మరింతగా ఉచ్చు బిగుసుకుంది. ఆయన్ను అరెస్ట్ చేసేంత వరకూ తమ ఉద్యమాన్ని విరమించబోమని, ఆయనపై అతి తక్కువ తీవ్రత గల సెక్షన్లను మాత్రమే నమోదు చేశారని ఆరోపిస్తూ, మహిళా సంఘాలు విశాఖలో చేస్తున్న నిరసనల దీక్ష మూడో రోజుకు చేరడంతో, వర్మపై మరిన్ని సెక్షన్లు జోడించేందుకు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఐటీ చట్టంతో పాటు, మహిళలను వేధించడం, లైంగిక వేధింపులకు గురిచేసేలా వ్యాఖ్యానించడం వంటి సెక్షన్లనూ ఆయనపై మోపినట్టు సమాచారం.

 వర్మపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తుండగా, తాజాగా, తనపై వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారని, కేసు పెడతానని ఆన్ లైన్లో బెదిరిస్తున్నారని బీజేపీ మహిళా నేత తుమ్మలపల్లి పద్మ మరో కేసు పెట్టారు. తాను టీవీ చానల్ లో పాల్గొని వర్మ చేస్తున్న పనులపై మహిళల అభిప్రాయాలను బయటపెట్టానని, అందుకు తనను ఆయన వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అందుకు ప్రాథమిక ఆధారాలు సేకరించి మరో కేసు నమోదు చేశారు.

Ramgopal Varma
Tummalapalli Padma
GST
Police
Women Activists
Vizag
  • Loading...

More Telugu News