Pakistan: భారత గగనతలంలో చక్కర్లు కొట్టిన పాకిస్థాన్ హెలికాప్టర్
- ఈ రోజు ఉదయం ఘటన
- పాక్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్
- నియంత్రణ రేఖ దాటి సుమారు 300 మీటర్లు భారత్‌లోకి
దాయాది పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ రోజు ఉదయం పాక్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ భారత గగనతలంలోకి వచ్చింది. సుమారు 10 సెకండ్ల పాటు ఆ విమానం ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందని సమాచారం. ఎంఐ-17 నియంత్రణ రేఖ దాటి సుమారు 300 మీటర్లు భారత్‌లోకి ప్రవేశించిందని సంబంధిత అధికారులు గుర్తించారు. భారత గగనతలంలో చక్కర్లు కొట్టిన తరువాత తిరిగి తమ ప్రాంతంలోకి అది వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ఎంఐ-17 హెలికాప్టర్ పాక్ సైన్యానికి చెందిన విమానమని తెలుస్తోంది.