Chandrababu: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రివర్గం

  • ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
  • 2.096 శాతం డీఏ పెంపుకు నిర్ణయం
  • పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన నవయుగకు పరిపాలన అనుమతులు 
  • అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టుల మంజూరుకు ఆమోదం

అమరావతిలోని సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2.096 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 2017 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు డీఏ చెల్లింపు ఉంటుంది.

పెంచిన డీఏ చెల్లింపు కారణంగా ప్రభుత్వంపై రూ.1048.60 కోట్ల భారం పడనుంది. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన నవయుగకు పరిపాలన అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవయుగకు రూ.1244 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టుల మంజూరుకు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరుకు ఆమోదాలు లభించాయి. 

  • Loading...

More Telugu News