Chinthamaneni Prabhakar: దోషిగా తేలిన చింతమనేనిపై వేటు వేయండి: వైసీపీ ఫిర్యాదు

  • మాజీ మంత్రి వట్టి, ఆయన గన్ మెన్ పై దాడి కేసు
  • చింతమనేనిని దోషిగా తేల్చిన కోర్టు
  • అనర్హత వేటు వేయాలని పట్టుబడుతున్న వైసీపీ

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, ఆయన గన్ మెన్ పై దాడి చేసిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో, దోషిగా తేలిన చింతమనేనిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చింతమనేని అనర్హతకు సంబంధించిన అన్ని వివరాలను సెక్రటరీకి ఇచ్చామని చెప్పారు. చింతమనేనిపై స్పీకర్ కోడెల త్వరగా నిర్ణయం తీసుకోవాలని... తద్వారా రాజ్యాంగ నీతినియమాలను కాపాడాలని కోరారు. వారం రోజులపాటు వేచి చూస్తామని, ఆ తరువాత కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ చెప్పారు.

Chinthamaneni Prabhakar
vatti vasantha kumar
court
YSRCP
Telugudesam
mla
  • Loading...

More Telugu News