Rajinikanth TV9: 'టీవీ9' యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు చెరిగిన రాంగోపాల్ వర్మ!

  • 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు ట్వీట్
  • చానల్ యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు
  • తప్పుడు వార్తలు అందిస్తున్నారని విమర్శలు
  • చట్టాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరిక

తెలుగు టీవీ చానల్ 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు ఈ ఉదయం వెల్లడించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరో ట్వీట్ పెడుతూ ఆ చానల్ యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు చెరిగాడు. నిజాలను నాశనం చేస్తూ, ఆయన తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించాడు. అసత్యాలను ప్రసారం చేస్తూ, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నాడు. ఓ నేరంపై విచారణ జరుగుతూ ఉండగా, 'విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు' అంటూ వార్తలు అందించడం కూడా నేరమేనని, అతి త్వరలో 'టీవీ9' భారత చట్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించాడు. 

  • Loading...

More Telugu News