High Court: టీటీడీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్న హైకోర్టు ఉత్తర్వులు

  • బహుళ పదోన్నతి రిజర్వేషన్ ను రద్దు చేయాలన్న హైకోర్టు
  • 20 మంది డిప్యూటీ ఈవోలు రివర్షన్ అయ్యే అవకాశం
  • సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న డిప్యూటీ ఈవోలు

హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులు టీటీడీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై ఏఈవో సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించగా... దాన్ని విచారించిన కోర్టు... బహుళ పదోన్నతి రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలంటూ తీర్పును వెలువరించింది. ఆరు వారాల్లోగా సీనియారిటీని క్రమబద్ధీకరించాలంటూ ఆదేశించింది. హైకోర్టు తీర్పు అమలైతే... దాదాపు 20 మంది డిప్యూటీ ఈవోలు రివర్షన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో, డిప్యూటీ ఈవోలు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ క్రమంలో, వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

High Court
TTD
promotions
  • Loading...

More Telugu News