Vijayawada: విటుడి కోసం ముంబై నుంచి విజయవాడ వచ్చి బుక్కయిన కాల్ గర్ల్!

  • ఆన్ లైన్ లో అమ్మాయిని బుక్ చేసుకున్న విజయవాడ వ్యక్తి
  • పేరు హనుమా నాయక్ అని మాత్రమే వివరం
  • విజయవాడకు వచ్చి హోటల్ లో దిగిన కాల్ గర్ల్
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడి

ముక్కూ మొహం తెలియని విటుడి కోసం ముంబై నుంచి విజయవాడకు వచ్చిన ఓ కాల్ గర్ల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన ఓ కాల్ గర్ల్ ను విజయవాడకు చెందిన హనుమా నాయక్ అనే వ్యక్తి ఆన్ లైన్ మాధ్యమంగా బుక్ చేసుకున్నాడు. ఆపై ఆమె ఖాతాకు డబ్బు పంపించడంతో ఆమె విజయవాడలో దిగింది.

హనుమా నాయక్ సూచనల మేరకు ఆమె పటమటలో ఉన్న ఓ హోటల్ లో మకాం వేయగా, ఆమె ప్రవర్తనతో అనుమానం వచ్చిన ఎవరో పోలీసులకు ఉప్పందించారు. దీంతో పోలీసులు దాడులు నిర్వహించగా, అప్పటికింకా ఆమెను బుక్ చేసుకున్న విటుడు హోటల్ కు చేరుకోలేదు. కాల్ గర్ల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హనుమా నాయక్ ఎవరన్న విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఎవరో తనకు తెలియదని, చూడలేదని ఆమె చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

Vijayawada
Mumbai
Call Girl
Arrest
  • Loading...

More Telugu News