warangal: ఘనంగా కలెక్టర్ ఆమ్రపాలి-సమీర్‌శర్మ వివాహం.. 23న వరంగల్‌లో విందు

  • బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం
  • ఈనెల 22న హైదరాబాద్ రాక
  • వరంగల్, హైదరాబాద్‌లలో రిసెప్షన్ అనంతరం హనీమూన్ కోసం టర్కీకి పయనం

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి-ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం సాయంత్రం జమ్ములో వీరి వివాహం ఘనంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో జరిగిన వీరి వివాహానికి కమిషనర్ శ్రుతి ఓఝా, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టరేట్ సిబ్బంది సహా పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది.

ఈనెల 21వ తేదీ వరకు జమ్ములోనే ఉండనున్న కొత్త దంపతులు 22న హైదరాబాద్ రానున్నారు. 23న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం ఈ నెల 26న హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్న ఆమ్రపాలి-సమీర్ శర్మ దంపతులు మార్చి 7 వరకు అక్కడే గడపనున్నారు.

warangal
Amrapali
Sameer sharma
Marriage
  • Loading...

More Telugu News