Lakshmi: 'మౌత్ ఆర్గన్' వాయిస్తున్న ఏనుగు... వీడియో వైరల్!
- కోయంబత్తూర్‌లో అలరిస్తున్న 'ఆండాల్' వాయిద్యం
- 48 రోజుల పాటు ఏనుగులకు వైద్య శిబిరం
- గత శిబిరంలో మౌత్ ఆర్గాన్‌తో 'లక్ష్మి' సందడి
సాధారణంగా కోతులు, రామచిలుకలు, మైనా పక్షులు లాంటి మూగజీవాలకు మనం ఎలా శిక్షణ ఇస్తే అవి అలా నేర్చుకుంటాయి. మనుషుల లాగా అవి కొన్ని పనులు చేస్తుంటే మనకెంతో ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంటుంది. తాజాగా కోయంబత్తూర్‌లో ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్‌ను వాయిస్తూ ఆందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఏనుగు పేరు ఆండాల్.
ఏనుగుల ఆరోగ్య సంరక్షణ, పునరుజ్జీవనం కోసం 48 రోజుల పాటు ఓ భారీ వైద్య శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. జనవరి 4న ప్రారంభమయిన ఈ వైద్య శిబిరం ఈ నెల 20తో ముగుస్తుంది. ఏనుగుల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన శిబిరంలో లక్ష్మి పేరున్న 11 ఏళ్ల ఏనుగు కూడా మౌత్ ఆర్గాన్ పరికరాన్ని వాయించి ఔరా అనిపించింది. ఆ ఏనుగు ఏడాది వయసున్నప్పటి నుంచే ఆ వాద్య పరికరాన్ని వాయిస్తుండటం విశేషం.

#WATCH: Elephant named Andaal plays mouth organ at temple elephants' rejuvenation camp in Coimbatore's Thekkampatti. #TamilNadu pic.twitter.com/APFnzQeOVc
— ANI (@ANI) February 18, 2018