Andhra Pradesh: బీజేపీ నేతలు లక్ష్మీపతిరాజా, హరిబాబు మధ్య వాగ్వాదం!

  • టీడీపీని కట్టడి చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్న లక్ష్మీపతిరాజా
  • ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ ఎంపీ హరిబాబు
  • ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం
  • లక్ష్మీపతిరాజాకు సర్దిచెప్పిన బీజేపీ నేతలు

విజయవాడలో బీజేపీ కీలక నేతల సమావేశంలో గందరగోళం నెలకొన్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల పని తీరుపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీని మొదటి నుంచి కట్టడి చేసుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఏపీలో బీజేపీ బలపడకుండా కొందరు నేతలు పక్కదారి పట్టిస్తున్నారని, పార్టీ విధివిధానాలు పాటించే అంశంలో తాము కూడా బాధ్యులుగానే ఉన్నామని లక్ష్మీపతిరాజా అన్నట్టు సమాచారం.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డట్టు సమాచారం. దీంతో, వారి మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తినట్టు పార్టీ వర్గాల సమాచారం. లక్ష్మీపతిరాజా, హరిబాబులను మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, పురంధేశ్వరి సముదాయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News