Chandrababu: చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి!: జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు

  • పోలవరం పనుల్లో ముడుపులు అందాయి
  • విదేశాల్లో ముడుపులు తీసుకున్నారు
  • మోదీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారు

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముడుపులు బాగా అందాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశాల్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలాడుతున్నారని అన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమయిందని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదని బీజేపీ అంటోందని... అదే నిజమైతే పార్లమెంటులో మెజార్టీ కలిగిన బీజేపీ చట్టంలో మార్పు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ కూడా సహకరిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. 

Chandrababu
bribe
jairam ramesh
polavaram
  • Loading...

More Telugu News