Bonda Uma: బీజేపీ నేతలు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు.. అంత సీన్ లేదు: బొండా ఉమ

  • ఏపీలో బీజేపీ ఎదుగుతుందని కలలు కంటున్నారు
  • లోక్ సభ ఎన్నికల్లో వీర్రాజుకి 7వేల ఓట్లు మాత్రమే పడ్డాయి
  • కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

ఏపీలో బీజేపీ ఎదుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారని... అది అత్యాశే అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత సీన్ బీజేపీకి లేదని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రతి రోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారని... 2009లో లోక్ సభకు ఆయన పోటీ చేస్తే కేవలం 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదని దుయ్యబట్టారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 24 వేల కోట్లు ప్రకటించి... రూ. 1050 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు రూ. 50 వేల కోట్ల విలువైన భూములు ఇస్తే... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఏపీలో బీజేపీకి అవకాశమే లేదని చెప్పారు.

Bonda Uma
somu veerraju
Andhra Pradesh
  • Loading...

More Telugu News