KCR: కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అగ్నిప్రమాదం.. క్షేమంగా బయటపడ్డ మంత్రి

  • మంచిర్యాల జిల్లాలో ప్రమాదం
  • కేక్ కట్ చేసిన అనంతరం బాణసంచా కాల్చిన కార్యకర్తలు
  • క్షేమంగా బయటపడ్డ మంత్రి జోగు రామన్న

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో అపశృతి దొర్లింది. వేడుకలు నిర్వహిస్తున్న టెంట్ కు మంటలు అంటుకున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే దివాకర్ రావులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో మున్నూరు కాపు సామాజిక భవన నిర్మాణానికి జోగు రామన్న భూమి పూజ చేశారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుని... కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో కొన్ని నిప్పురవ్వలు టెంట్ మీద పడటంతో, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టెంట్ పూర్తిగా దగ్ధమయింది. అక్కడ వేసిన కుర్చీలు కూడా కాలిపోయాయి.

KCR
birthday
jogu ramanna
Fire Accident
  • Loading...

More Telugu News