priya warrior: ప్రియా వారియర్ పాటపై వివాదం ఎందుకు?

  • కన్నుగీటి కుర్రకారును ఫ్లాట్ చేసిన ప్రియా వారియర్
  • పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు
  • మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపించారంటూ ఆగ్రహం

కనుసైగలతో, అద్భుతమైన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ సెటబ్రిటీగా మారిపోయింది మలయాళ నటి ప్రియా వారియర్. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ దక్కని సెలబ్రిటీ స్టేటస్ ఆమెకు ఒక్క రోజులోనే దక్కింది. మరోవైపు, ఆపె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు. ఆమె నటించిన 'ఒరు ఆదార్ లవ్' సినిమాలోని 'మాణిక్య మలరాయ పూవీ' అనే పాటను తొలగించాలని ముంబైకి చెందిన పలు ముస్లిం సంఘాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విన్నవించాయి.

ప్రియా నటించిన పాటలోని భావం ముస్లింల మనోభావాలను గాయపరిచేలా వుందని రజా అకాడమీ తెలిపింది. ఈ పాట మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపిస్తోందని రజా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ తెలిపారు.

priya warrior
muslims
prophet mohemmad
  • Loading...

More Telugu News