India: ఈ ఏడాది జూన్ నాటికి భారత్ లో 5జీ సేవలు.. కసరత్తు ప్రారంభం!
- 5జీ సేవల మార్గసూచీ ఖరారు కానుంది
- ఓ కమిటీని ఏర్పాటు చేశాం..కసరత్తు ప్రారంభించాం
- కేంద్ర టెలికాం శాఖ
ఈ ఏడాది జూన్ నాటికి భారత్ లో 5జీ సేవలకు సంబంధించిన మార్గసూచీ ఖరారు కానున్నట్టు కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే నాటికి మన దేశంలో కూడా ఆ సేవలను అందిపుచ్చుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. 5జీ సిమ్ లకు కొత్త నెంబర్ల రూపకల్పన చేస్తున్నామని, దీని ద్వారా కార్లలోని సెన్సర్ల ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించే ఏర్పాట్లు చేసినట్టు టెలికం శాఖ స్పష్టం చేసింది.
కాగా, 5జీ సేవలకు సంబంధించిన ప్రపంచ ప్రమాణాలు ఈ ఏడాదిలోనే తుదిరూపు దిద్దుకోగలవని భావిస్తున్నారు. అదే సమయానికి భారత్ లో కూడా 5జీ సేవలు అందేలా చర్యలను ప్రారంభించడం గమనార్హం.