rama: చెన్నంపల్లి కోట తవ్వకాల్లో బయటపడ్డ సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలు

  • కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు
  • బయటపడ్డ పంచలోహ విగ్రహాలు
  • క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినవిగా గుర్తింపు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో కొన్ని రోజులుగా పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్నారు. కాగా, ఈ రోజు జరుపుతోన్న తవ్వకాల్లో ఆ ప్రాంతంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అందులో సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు మీడియాకు వివరించి చెప్పారు. వాటిని క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన ఇతర విగ్రహాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది. తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News